భార్యపై అనుమానం.. ఇద్దరు పిల్లల హత్య

16 Oct, 2020 09:20 IST|Sakshi
సంఘటనా స్థలంలో కుటుంబ సభ్యులు

తనకు పుట్టలేదేమోనని కవలల ఉసురు తీసిన వైనం 

సాక్షి, కళ్యాణదుర్గం రూరల్‌ : ఆ తండ్రికి అనుమానం పెనుభూతమైంది.. పిల్లలు తనకు పుట్టలేదేమోనన్న అనుమానంతో గొంతు నులిమి కవలల ప్రాణాలు తీశాడు. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చాకలి రవి (చెవుడు, మూగ)కి రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లికి చెందిన రాధమ్మతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి కవలలు సుధీర్‌(5), సుదీప్‌(5) జన్మించారు. అయితే రాధమ్మపై భర్త రవికి అనుమానం. పిల్లలు కూడా తనకు పుట్టలేదన్న అనుమానంతో తరచూ భార్యతో గొడవపడేవాడు.

ఇదిలా ఉండగా బుధవారం రాత్రి ఇంట్లో భార్యాప్లిలు నిద్రపోయాక చిన్నారుల గొంతు నులిమి వారి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత మృతదేహాలను గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గుంతలు తీసి పూడ్చిపెట్టాడు. ఉదయాన్నే రాధమ్మ నిద్రలేచాక పిల్లలు కనిపించకపోవడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. చుట్టుపక్కల వారిని విచారించింది.  (భార్యపై అనుమానంతో తల నరికి..)

అప్పటి దాకా కనిపించకుండా పోయి అదే సమయంలో అక్కడికొచ్చిన రవిని కుటుంబ సభ్యులు నిలదీశారు. దీంతో జరిగిన విషయం(సైగలతో) చెప్పాడు. పిల్లల్ని పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని చూపించాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలిద్దరూ విగత జీవులుగా కనిపించడంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, సీఐ శివశంకర్‌నాయక్‌లు ఘటనా స్థలానికి చేరుకుని రవిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా