ఏడు పేజీల సూసైడ్ నోట్‌.. కుమార్తెలతో సహా తండ్రి ఆత్మహత్య

19 Sep, 2022 15:12 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి (తూర్పుగోదావరి జిల్లా): రాజమండ్రి రూరల్ రాజవోలులో తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో సహా చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో తండ్రి మృతదేహం కూడా లభించింది. రాజమండ్రిలో ఆడిటర్‌గా పని చేస్తున్న సత్య కుమార్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రిషిత (12), చిన కుమార్తె అద్విత (7)తో కలసి నిన్న సాయంత్రం రాజవోలు చెరువు వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చి, చెరువులోకి దూకి ఆత్మహత్యకు పడ్డారు.
చదవండి: ‘తలపోటుగా ఉంది.. మాత్ర తెచ్చుకుంటా’.. ఇంతలోనే బిగ్‌ షాక్‌

పనిలో ఉన్న ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఏడు పేజీల సూసైడ్ నోట్‌ని కూడా  వాహనం వద్ద ఉంచారు. ఈ ఘటనకు పాల్పడుతున్న సమయంలో సత్య కుమార్ భార్య విశాఖ వెళ్లినట్టు తెలుస్తోంది. భర్త ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందిన భార్య బంధువులకు ఫోన్ చేయడంతో సమాచారం తెలిసింది. సంఘటన స్థలానికి వచ్చిన ఆమె  భర్త, పిల్లల మృతదేహాలను చూసి బోరున విలపిస్తోంది. పిల్లలపై ఉన్న మక్కువతోనే సత్యకుమార్ పిల్లల్ని కూడా తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. ఇప్పటికే మిస్సింగ్ కేసు నమోదు చేసిన బొమ్మూరు పోలీసులు ఈ వ్యవహారంపై  విచారణ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు