తండ్రీ కూతురు అదృశ్యం

31 Mar, 2021 10:33 IST|Sakshi

అడ్డగుట్ట: తండ్రి, కూతురు అదృశ్యమైన ఘటన తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. వినోభానగర్‌కు చెందిన సింగెపల్లి మంజునాథ్‌(33) వంట పని చేస్తుంటాడు. ఈ నెల 23న తన కూతురు చైతన్య(13)ను తీసుకొని అడ్డగుట్టలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. రెండు రోజులు అక్కడే ఉన్నాడు. 25వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన కూతురిని తీసుకొని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ తెలియకపోవడంతో మంజునాథ్‌ కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి తుకారాంగేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గృహిణి అదృశ్యం 
అంబర్‌పేట:  భర్తతో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకోవడంతో మనోవేదనకు గురైన ఓ వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన మంగళవారం అంబర్‌పేట పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవీందర్‌ కథనం ప్రకారం.. బాగ్‌ అంబర్‌పేట మల్లిఖార్జుననగర్‌లో నివసించే యేసు, శాంతకుమారి(39) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. ఈనెల 28న భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దీంతో మనస్థాపానికి గురైన శాంతకుమారి ఈనెల 29న ఆసుపత్రికి వెళుతున్నానని ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన యేసు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

చదవండి: తాగి తందనాలు.. భార్య హోటల్‌లో పనిచేస్తుండటంతో

మరిన్ని వార్తలు