విషాదం.. కొడుకు పుట్టినరోజే.. తండ్రి ఆత్మహత్య..

20 Mar, 2023 09:32 IST|Sakshi

ఉండవెల్లి: కొడుకు జన్మించిన రోజే ఓ తండ్రి బలవ­న్మర ణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో చోటు చేసు కుంది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న రాజు (29)కు కొన్నేళ్ల క్రితం గీతతో వివాహమైంది. వారిద్దరికి పాప, కుమారుడు ఉండగా.. ఆదివారం మూడో సంతానంగా మగ బిడ్డ అలంపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించాడు.

కుమారుడిని చూసి వచ్చిన రాజు.. మధ్యాహ్నం వేళ ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదని అతని తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: జైలు నుంచి బయటకొచ్చిన నిహారిక

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు