వేధింపులు తాళలేక... కుమారుడిని దారుణంగా చంపిన తండ్రి

26 Feb, 2024 08:08 IST|Sakshi

శామీర్‌పేట్‌: మద్యానికి బానిసై తరచూ డబ్బుల కోసం వేధిస్తుండటంతో కుమారుడిని కన్న తండ్రే హత్య చేసిన  సంఘటన ఆదివారం జొనోమ్‌వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లా, శామీర్‌పేట మండలం, లాల్‌గడి మలక్‌పేట గ్రామానికి చెందిన కొరివి మంజుల రాంచందర్‌ దంపతులకు ఇద్దరు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసైన పెద్ద కొడుకు నరేష్‌ (27) డబ్బుల కోసం ప్రతి రోజు తల్లిదండ్రులను వేధించడమేగాక దాడి చేసేవాడు.

ఈ నెల 11న ఉదయం రూ. 10 వేలు ఇవ్వాలంటూ తండ్రి రాంచందర్‌తో నరేష్‌ గొడవపడ్డాడు. అతడి వైఖరితో విసిగిపోయిన రాంచందర్‌ పథకం ప్రకారం డబ్బులు ఇస్తానని నమ్మించి నరేష్ ను గ్రామంలోని మర్లల్ల బావి సమీపంలోకి తీసుకెళ్లాడు. నరే‹Ùకు మద్యం తాగించి అతడు మత్తులోకి జారుకోగానే గొంతుపై కాలితో తొక్కి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేసి అక్కడినుంచి వెళ్లి పోయాడు. కాగా ఈ నెల 21న అతడి తల్లి మంజుల కుమారుడు కనిపించడం లేదని జినోమ్‌ వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తండ్రి రాంచందర్‌ హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు