భార్యకు భారం కాకూడదని భర్త అఘాయిత్యం.. పెద్దకూతురు ప్రాణాలు కాపాడిన హోంవర్క్‌

5 Feb, 2023 13:21 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: ‘అమ్మా.. నాన్నతో కలిసి పెళ్లికి వెళ్తున్నం.. అక్క, నువ్వు కూడా వస్తే బాగుండు.. కానీ, మీరు ఎందుకు రావడం లేదు..? అయినా మేం వెళ్లి వస్తం.. బైబై’ అంటూ తండ్రితో కలిసి సంతోషంగా బయటకు వెళ్లారు.. పెళ్లి వేడుకకు హాజరై విందు ఆరగించారు.. ఆ తర్వాత ఇంటిదారి పట్టారు.. కొద్దిక్షణాల్లో ఇంటికి చేరుకుంటామనే లోపే.. తండ్రి వారిద్దరినీ బావిలోకి తోసేశాడు.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన శుక్రవారం రాత్రి 9.30గంటల సమయంలో నర్సింగాపూర్‌ శివారులో చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్‌ మండలం నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన గడ్డం జలపతిరెడ్డి(45) – కవిత దంపతులు. వీరికి కూతుళ్లు జాష్మిత, ప్రణిత్య, మధుమిత ఉన్నారు. జాష్మిత కండ్లపల్లి మోడల్‌ స్కూల్‌లో ఏడోతరగతి, మిగతా ఇద్దరు జగిత్యాలలోని ఓ ప్రైవేట్‌ బడిలో వరుసగా నాలుగో, రెండోతరగతి చదువుతున్నారు.

తను అప్పు ఇచ్చి.. మరికొందరి వద్ద అప్పు చేసి.
జలపతిరెడ్డి కొందరికి కొంత అప్పు ఇచ్చాడు. వారు తిరిగి ఇవ్వడంలేదు. తన కుటుంబ అవసరాలకో సం అతడు కూడా రూ.4 లక్షల వరకు అప్పు చేశాడు.అవి తీర్చే దారిలేకపోవడం, ప్రభుత్వం సేకరించిన నాలుగెకరాలకు సంబంధించిన పరిహారం ఇప్పించడంలో ఓ న్యాయవాది తీవ్ర జాప్యం చేయడంతో కొంతకాలంగా మనస్తాపంతో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు తన రెండోకూతురు ప్రణిత్య, చిన్నకూతురు మధుమితను వెంటబెట్టుకుని ద్విచక్ర శుక్రవారం రాత్రి 8గంటలకు జగిత్యాలకు బయలు దేరాడు.

► ఓ ఫంక్షన్‌హాల్‌లో వేడుకకు హాజరై అందరూ విందు భోజనం చేశారు.
► రాత్రి 9.30 గంటల సమయంలో ముగ్గురూ ఇంటికి బయల్దేరారు.
► నర్సింగాపూర్‌ శివారులోని ఎల్లమ్మగుడి వద్దగల వ్యవసాయ బావివద్దకు చేరుకున్నారు.
► తొలుత తన ఇద్దరు కుమార్తెలను జలపతిరెడ్డి బావిలో తోసేశాడు.
► ఆపై తానూ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
► రాత్రి 10 గంటల వరకూ పిల్లలు, భర్త ఇంటికి రాకపోవడంతో భార్య కవిత ఆందోళన చెందింది.
► పలుమార్లు ఫోన్‌చేయగా లిఫ్ట్‌ కాలేదు. మనసులో ఏదో కీడు శంచింకింది.
► ఉదయం 8 గంటల సమయంలో నర్సింగాపూర్‌ ఎల్లమ్మ గుడి వద్ద తన సోదరుడు రాజిరెడ్డి వ్యవసాయ పొలం వద్ద జలపతిరెడ్డి మృతదేహం లభ్యమైంది. 
► సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ ప్రకాశ్, రూరల్‌ సీఐ కృష్ణకుమార్, ఎస్సై అనిల్‌.. బాలికల కోసం ఆరా తీశారు.
► అయితే, ధరూర్‌కు చెందిన చల్ల వెంకన్నకు జలపతిరెడ్డి తనకు తనకు మిగిలిన ఎకరం విక్రయించిన భూమిలోని బావిలో చిన్నారుల మృతదేçహాలు కనిపించాయి.

పథకం ప్రకారమే..
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న జలపతి రెడ్డి.. భార్య కవితకు కుమార్తెలు భారం కాకూడదని భావించాడు. పథకం ప్రకారమే కూతుళ్లను శుభకార్యానికి తీసుకెళ్లేందుకు సిద్ధం చేశాడు. పిల్లల్ని బావిలో తోసేస్తూ తన ఫోన్లో చిత్రీకరించినట్లు తెలిసింది. అంతకు ముందే అక్కడ సూసైడ్‌ నోట్‌ రాసి జేబులో పెట్టుకున్నాడు. భార్యకు వాట్సాప్‌లో పోస్ట్‌ చేశాడు.

పెద్దకూతురు ప్రాణాలు కాపాడిన హోంవర్క్‌
పెద్దకుమార్తె జాష్మితను తమతోపాటే తీసుకెళ్లేందుకు జలపత్తిరెడ్డి యత్నించాడు. కానీ తన కు హోంవర్క్‌ ఉందని, పెళ్లికి రాను అని బాలి క మొండికేసింది. తండ్రి బుజ్జగించినా ససే మిరా అనడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. 

గ్రామంలో విషాదం.
లపతిరెడ్డి తన ఇద్దరు కుమార్తెలతో ఆత్మహత్య చేసుకోవడం నర్సింగాపూర్‌ గ్రామంలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. జలపతిరెడ్డి అందరితో కలిసిమెలిసి ఉండేవాడని గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు. భార్య, పెద్దకూతురు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, పెద్ద కుమార్తె జాష్మిత.. తన తండ్రి చితికి నిప్పంటించగా ప్రణిత్య, మధుమితల మృతదేహాలకు పూడ్చిపెట్టారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. అంత్యక్రియలకు హాజరయ్యారు. 

న్యాయవాదే కారణమని సూసైడ్‌ నోట్‌
జగిత్యాల శివారులోని టీఆర్‌నగర్‌ గ్రామం స్థాపించేందుకు రాష్ట్రప్రభుత్వం 1985లో జలపతిరెడ్డికి ఉన్న ఐదెకరాల్లో నాలుగు ఎకరాలు సేకరించింది. ఆయనతోపాటు నర్సింగాపూర్‌ గ్రామానికే చెందిన రైతుల నుంచి కూడా 45.20 ఎకరాలు సేకరించింది. అయితే, కోర్టులో కేసు వేయగా తొలిదశలో ఎకరాకు రూ.16వేల చొప్పున వడ్డీతో కలిపి మొత్తం రైతుల కోసం రూ.45,95,516 సొమ్మును రెవెన్యూ శాఖ కోర్టులో జమచేసింది. ఆ సొమ్ములో తనకు రావాలి్సన సొమ్ము ఇప్పించాలని న్యాయవాదిని జలపతిరెడ్డి చాలాసార్లు కలిసి విన్నవించాడు.

డబ్బులు ఇప్పించడంలో లాయర్‌ నిర్లక్ష్యం చేశాడు. ఒకవైపు తనకున్న ఎకరం విక్రయించినా చేసిన అప్పులు తీరే దారిలేకపోవడం, ఇతరులకు ఇచ్చిన అప్పులు రాకపోవడం కూడా తోడుకావడంతో జలపతిరెడ్డి మనస్తాపం చెందాడు. తన చావుకు న్యాయవాదే కారణమని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. తన భర్త ఆత్మహత్యకు న్యాయవాది కారణమని మృతుడి భా ర్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు న్యాయవాది దామోదర్‌రా వుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్‌  తెలిపారు.

మరిన్ని వార్తలు