Guntur Crime News: ఉద్యోగం కోసం తండ్రితో కలవాలని భర్త ఆదేశం

3 Aug, 2021 09:21 IST|Sakshi

నాతో ఉండు నీకు న్యాయం చేస్తా..

కోడలితో మామ అసభ్యప్రవర్తన

ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు

గుంటూరు ఈస్ట్‌: తిరుగుబోతు భర్త.. కీచక మామల నుంచి తన కుమార్తెకు రక్షణ కల్పించాలని ఓ మహిళ పోలీసులను వేడుకుంది. అర్బన్‌ ఎస్పీ సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళ తన గోడు వెల్లబోసుకుంది. వారు తెలిపిన వివరాలు.. డొంకరోడ్డుకు చెందిన ఎలినేని సందీప్‌ మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. 2016 సంవత్సరంలో శ్రీనగర్‌కు చెందిన స్వాతితో వివాహం అయింది. సందీప్‌ టిక్‌టాక్‌ ద్వారా పరిచయం అయిన అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని జల్సాగా తిరిగేవాడు.

స్నేహితురాలు అంటూ ఓ మహిళను తరచూ ఇంటికి  తీసుకువచ్చేవాడు. సందీప్‌ తల్లి పద్మావతి కూడా అతనికే వత్తాసు పలికింది. 2017 సంవత్సరంలో ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసే పద్మావతి అనారోగ్యంతో మృతి చెందింది. కంభంపాడులో నివసించే సందీప్‌ తండ్రి శ్రీనివాసరావు తరచూ మా ఇంటికి వచ్చి స్వాతితో అసభ్యంగా ప్రవర్తించే వాడు. భర్తకు చెబితే తండ్రినే వెనుకేసుకుని వచ్చాడు. పద్మావతి ఉద్యోగం కుమారుడికి రావాలంటే శ్రీనివాసరావు ఎన్‌ఓసిపై సంతకం చేయాలి. ఈ కారణంగా తన తండ్రికి సహకరించమంటూ నా భర్త ప్రోత్సహించాడు. మామ శ్రీనివాసరావు బాత్‌రూమ్‌లో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టాడు.

కుమారుడిని ఇతర మహిళలతో తిరగకుండా బుద్ది చెప్పాలని, నాకు న్యాయం చేయాలని నా మామను కోరితే నాతో ఉండు నీకు న్యాయం చేస్తానంటూ దుర్మార్గంగా ప్రవర్తించాడు. అనంతర కాలంలో స్వాతికి, ఆమె కుమార్తెకు సరిగా తిండి పెట్టలేదు. మామ లైంగిక దాడికి యత్నించగా ఆమె ఎదురుతిరిగి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తింది. నువ్వు లొంగక పోతే నీ కుమార్తె (2 సంవత్సరాల పాప) తో కోరిక తీర్చుకుంటానని పాపను లాక్కుని బెదిరించాడు.

శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు. 2018 డిసెంబర్‌లో బంధువుల సహాయంతో శ్రీనగర్‌లోని పుట్టింటికి చేరింది. ఒకరోజు భర్త ఇంటి ముందు ఉన్నాను బయటకు రమ్మంటే వెళ్లింది. కొందరు వ్యక్తులు ఆమెపై రాళ్లు విసిరారు. ఫిర్యాదు చేసేందుకు వస్తున్నానని తెలిసి చంపుతామని బెదిరించారు. నాకు, నా కుమార్తెకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలని కోరింది.

మరిన్ని వార్తలు