కూతురిపై కన్న తండ్రి అత్యాచారం

10 Aug, 2020 12:10 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సింహాచలం(పెందుర్తి): కన్న కూతురిపై తండ్రే అత్యాచారం చేసిన ఘటన జీవీఎంసీ 98వ వార్డు పరిధి అప్పన్నపాలెంలో చోటు చేసుకుంది. పెందుర్తి సీఐ అశోక్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాపీమేస్త్రిగా పని చేస్తున్న పొడుగు అప్పారావు(55) భార్య, ముగ్గురు ఆడపిల్లలతో అప్పన్నపాలెంలో ఉంటున్నాడు. ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా.. పదిహేడేళ్ల వయస్సు ఉన్న ఇంకో కుమార్తెకు మతిస్థిమితం సరిగ్గా లేదు. కొంత కాలంగా వివాహమైన మరో కుమార్తె కూడా కొన్ని కారణాల వల్ల తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.

ఇటీవల మతిస్థిమితం లేని కుమార్తెకు ఆరోగ్యం బాగోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన వైద్యులు ఆస్పత్రిలో స్కానింగ్‌ చేసి, గర్భవతి అని నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. తన సోదరి గర్భవతి కావడానికి కారణం తండ్రేనని మరో కుమార్తె పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అప్పారావు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షలు నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు