Hyderabad: బాలికపై సవతి తండ్రి అత్యాచారం

16 Sep, 2021 09:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చాంద్రాయణగుట్ట: వావి వరుసలు మరిచి మూడేళ్లుగా కూతురుపై అత్యాచారానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ కేఎన్‌ ప్రసాద్‌ వర్మ తెలిపిన వివరాల ప్రకారం....బండ్లగూడ గౌస్‌నగర్‌కు చెందిన మహిళకు 14 ఏళ్ల కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు సంతానం. కాగా ఆమె భర్తతో విడాకులు తీసుకొని 2017లో అంబర్‌పేటకు చెందిన వ్యాపారి సయ్యద్‌ షరీఫ్‌ యూసుఫ్‌(45)ను వివాహం చేసుకుంది.

అంబర్‌పేటలోని మొదటి భార్యతో నివాసం ఉండే యూసుఫ్‌ అప్పుడప్పుడు గౌస్‌నగర్‌కు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల బాలిక బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. రెండు రోజుల క్రితం విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  

వదినపై ఆత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు..    
డబీర్‌పురా: వదినపై ఆత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిని మీర్‌చౌక్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పురానీహవేలి ప్రాంతానికి చెందిన ఏసీ మెకానిక్‌ మీర్‌ ఇర్ఫాన్‌ అలీ (28) అన్న, వదినతో కలిసి నివాసముంటున్నాడు. కాగా ఈ నెల 14న మీర్‌ ఇర్ఫాన్‌ అలీ అన్న ఇంట్లో లేని సమయంలో వదినపై బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు ఇర్ఫాన్‌ అలీని బుధవారం అరెస్టు చేశారు.  

చదవండి: Banjara Hills: భర్తను చున్నీతో హత్యచేసి.. ఆ త​ర్వాత

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు