మైనర్‌ బాలికపై ప్రియుని తండ్రి అఘాయిత్యం 

11 Nov, 2021 07:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చిక్కమగళూరు(కర్ణాటక): కుమారుడు ప్రేమించిన మైనర్‌ బాలికపై అతని తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన చిక్కమగళూరు బాళే హొన్నూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మైనర్‌ బాలికను ఓ యువకుడు ప్రేమలోకి దించాడు. తన ఇంటికి తీసుకెళ్లి పని మీద బయటికి వెళ్లాడు. ఆ సమయంలో యువకుని తండ్రి చంద్రు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి బాళేహొన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా మృగాన్ని అరెస్టు చేశారు.

ప్రయాణికులిని కాపాడిన పోలీసులు 
శివమొగ్గ: రైలు దిగుతూ అదుపు తప్పి కింద పడిపోతున్న మహిళను పోలీసులు కాపాడారు. వివరాలు.. ఒక మహిళ తన బంధువులకు వీడ్కోలు పలికేందుకు మంగళవారం ఉదయం శివమొగ్గ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. బంధువులను తాళగుప్ప–బెంగళూరు ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించింది. తాను కూడా రైలు ఎక్కి వారితో కాసేపు ముచ్చటించింది.

7.05 గంటలకు రైలు బయల్దేరుతుండగా కిందకు దిగే ప్రయత్నంలో ప్లాట్‌ఫారం, రైలుబోగి మధ్యలోకి ఆమె జారిపోతుండగా అక్కడే ఉన్న రైల్వే పోలీసులు అణ్ణప్ప, సంతోష్‌కుమార్, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబల్‌ జగదీ‹లు వెనక్కు లాగారు. దీంతో ఆమె ప్రమాదం నుంచి బయట పడింది. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఆమె పట్టాలపైకి పడి ప్రాణాలు కోల్పోయేది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.     

మరిన్ని వార్తలు