బావతో ‘పెళ్లి ఖాయం’.. ఉరికి వేలాడుతూ కనిపించిన మహిళా కానిస్టేబుల్‌

6 Nov, 2021 07:25 IST|Sakshi

కోనేరుసెంటర్‌(కృష్ణా జిల్లా): కృష్ణా జిల్లా ఏఆర్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం సామవరం గ్రామానికి చెందిన జిల్లేపల్లి ప్రశాంతి (23) ఆర్మ్‌డ్‌ రిజర్వు విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. మచిలీపట్నం పరాసుపేటలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. పరాసుపేటలోని ఓ స్కూల్‌లో పని చేసే తన బావ రాజేష్‌తో ఇటీవల ఆమెకు వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు.
(చదవండి: అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా యువతి.. బిక్కుబిక్కుమంటూ..)

ఈ క్రమంలో గురువారం ప్రశాంతి రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన ఇంటి యజమాని మచిలీపట్నం పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బందరు డీఎస్పీ మాసూంభాషా, చిలకలపూడి సీఐ అంకబాబు వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన మచిలీపట్నం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం  కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. ఏఆర్‌ విభాగం అధికారులు, తోటి సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. 
చదవండి: జవాన్‌ను మింగేసిన మంచు 

మరిన్ని వార్తలు