తల్లి, సోదరిని చంపి తానూ చావాలనుకుంది..

23 Aug, 2021 04:57 IST|Sakshi

సూరత్‌: తల్లి, సోదరికి ఇంజెక్షన్లు ఇచ్చి చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని గుజరాత్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్‌ ప్రయత్నించారు. గుజరాత్‌లోని కాటగ్రామ్‌లో జరిగిన ఈ ఘటనలో తల్లి, సోదరి మరణించగా ఆత్మహత్యాయత్నం చేసిన డాక్టర్‌ దర్శన ప్రజాపతి (30) మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆమె ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక ఏసీపీ డీజే చద్వా ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి డాక్టర్‌ దర్శన తన తల్లి మంజులాబెన్‌ (59), సోదరి ఫాల్గుని (28)లకు డ్రగ్స్‌ను ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చారు. అనంతరం ఆమె కూడా నిద్రమాత్రలు మింగారు. ఆదివారం ఉదయానికి తల్లీ, సోదరి మరణించగా ఆమె మాత్రం ప్రాణాలతో మిగిలారు. తనకు జీవితంపై విరక్తి కలిగిందనీ, తల్లి్ల, సోదరి తనపైనే ఆధారపడి ఉండటంతో వారిని కూడా అంతం చేయాలని భావించినట్లు దర్శన పోలీసులకు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు