Daughters WhatsApp Status: ఇరు కుటుంబాల్లో చిచ్చు రేపిన కూతురి నిర్వాకం.. తల్లి ఉసురు తీసిన వాట్సాప్‌ స్టేటస్‌!

14 Feb, 2022 15:18 IST|Sakshi

ఇంతవరకు మనం సోషల్‌ మీడియాలో వ్యక్తిగత విషయాలను, ఫోటోలను పెట్టి సమస్యల్లో చిక్కుకుని మృతి చెందిన ఉందంతాల గురించి విన్నాం. కానీ వాట్సాప్‌ స్టేటస్‌ల కారణంగా నేరాలకు పాల్పడిన సందర్భాలు గురించి విని ఉండం. అచ్చం అలాంటి సంఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

అసలు విషయంలోకెళ్తే...మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో 48 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది. మృతురాలి కుమార్తె ప్రీతి ప్రసాద్‌(20) పెట్టిన వాట్సాప్‌ స్టేటస్‌ అదే పరిసరాల్లో నివసిస్తున్న ఆమె స్నేహితుడు..17 ఏళ్ల మైనర్‌ యువకుడి కుటుంబానికి ఆగ్రహం తెప్పించింది. నిజానికి ఆ వాట్సాప్‌ స్టేటస్‌తో ఆ మైనర్‌కి సంబంధం లేదు.

కానీ ఆ యువకుడు ప్రీతి పెట్టిన వాట్సాప్‌ తనకు సంబంధించిందేనని భావించి ఆగ్రహంతో అతను, అతని తల్లి, సోదరుడు ప్రీతి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో ప్రీతి తల్లి లీలావతి దేవి ప్రసాద్‌ పక్కటెముకాలకు తీవ్రంగా గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకుడు తల్లి, మరో ఇద్దరు కుట్టుంబ సభ్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ.. "వాట్సాప్‌ స్టేటస్‌ గురించి వెల్లడించలేం. కానీ మైనర్‌ యువకుడు ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశం మాత్రం కాదు. అంతేకాదు మృతురాలికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అయితే ఈ దాడిలో జరిగిన తీవ్ర గాయం కారణంగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది" అని తెలిపారు.

మరిన్ని వార్తలు