నటుడు దుర్మరణం: స్నేహితుడిపై కేసు

15 Jun, 2021 13:35 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో నటుడు సంచారి విజయ్‌ దుర్మరణం

స్నేహితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు 

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన కర్ణాటక ప్రభుత్వం

సాక్షి, బెంగళూరు: కన్నడ నటుడు సంచారి విజయ్‌ అకాలమరణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.స్నేహితుడితోకలిసి వస్తుండగా ప్రమాదానికి గురైన విజయ్‌ తీవ్రగాయాలతో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే  ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో  విజయ్ స్నేహితుడు నవీన్‌పై  ఐపీసీ సెక్షన్ 279, 338 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరోవైపు విజయ్‌ మరణం తరువాత అతని అవయవాలను దానం చేసేందుకు కుటుంబం ముందుకొచ్చింది. దీనిపై కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప సంతోషం వ్యక్తం చేశారు. విజయ్‌ మరణంపై విచారం వ్యక్తం సీఎం నటుడు మరికొందరికి జీవం పోశారని కొనియాడారు. ప్రభుత్వ  అధికార లాంఛనాలతో విజయ్‌ అంత్యక్రియలను  నిర్వహించనున్నట్టు చెప్పారు

కాగా జూన్ 12 శనివారం రాత్రి 11:30 గంటలకు బెంగళూరులోని జేపీ నగర్ సమీపంలో తన స్నేహితుడు నవీన్‌ కలిసి వస్తున్నారు. ఆ సమయంలో వేగంతో వెళుతున్న బైక్‌ ఎదురుగా ఉన్న విద్యుత్‌ స‍్తంభానికి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో విజయ్‌ తలకు తీవ్రగాయం కావడంతో అత్యవసర చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే విజయ్‌ బ్రెయిన్‌ డెడ్‌ అయ్యిందని అపోలో వైద్యులు తెలిపారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డాక్టర్ అశ్వత్ నారాయణ్ నడుపుతున్న ఫౌండేషన్ విజయ్ చికిత్స ఖర్చులను భరించేందుకు ముందుకువచ్చారు.

చదవండి : కొరటాల బర్త్‌డే : ఎమోషనల్‌ ట్వీట్‌ చేసిన ఎన్టీఆర్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు