ఢిల్లీలో సిలిండర్‌ పేలుడు.. నలుగురు మృతి

30 Jun, 2021 07:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫర్ష్‌ బజార్‌లోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. మంగళవారం రాత్రి జరిగిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో వ్యక్తికి త్రీవ గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్‌ మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్‌ సిలిండర్‌  ప్రమాదంలో నలుగురు మరణించారని, మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు.

చదవండి: ట్విట్టర్‌పై కేసుల వెల్లువ

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు