YSR Kadapa: ప్లాస్టిక్‌ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

14 Sep, 2021 06:54 IST|Sakshi

వైఎస్సార్‌ కడప: వైఎస్సార్‌ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బద్వేలులోని నాగభూషణం డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న ప్లాస్టిక్‌ గోడౌన్‌ షాపులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

మైదుకురు, పోరుమామిళ్ల నుంచి వచ్చిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

చదవండి: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

మరిన్ని వార్తలు