హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం..

6 Oct, 2020 14:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. సిద్దింబెర్ బజార్‌లోని రాజధాని మోటార్స్ గోడౌన్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలానికి నాలుగు ఫైరింజన్లు చేరుకున్నాయి. మంటలను ఫైర్‌ సిబ్బంది, బేగంపేట బజార్‌ పోలీసులు అదుపులోకి తీసుకువస్తున్నారు.షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు