ములుగు జిల్లాలో కాల్పుల కలకలం.. కానిస్టేబుల్‌ తూటాలకు ఎస్‌ఐ బలి.. భయాందోళనతో తనూ కాల్చుకుని..

27 Dec, 2021 11:19 IST|Sakshi

మెస్‌ బిల్లుల లెక్కల్లో అవకతవకల విషయంలో ఘర్షణ

సీఆర్‌పీఎఫ్‌ ఎస్సైపై హెడ్‌ కానిస్టేబుల్‌ కాల్పులు..మృతిచెందిన ఎస్సై

తర్వాత తానూ కాల్చుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌.. హైదరాబాద్‌కు తరలింపు

ములుగు జిల్లా వెంకటాపురం(కె) సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌లో ఘటన  

సాక్షి, ములుగు(ఏటూరునాగారం): మెస్‌ బిల్లుల లెక్కల్లో హెచ్చు తగ్గుల విషయంలో సీఆర్‌పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్, ఎస్సై మధ్య జరిగిన గొడవ కాల్పుల వరకు దారితీసింది. ములుగు జిల్లా వెంకటాపురం(కె) పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోని సీఆర్‌పీఎఫ్‌ 39వ బెటాలియన్‌ క్యాంప్‌లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. క్యాంప్‌లో ఉదయం 8.30 సమయంలో టిఫిన్‌ చేసే క్రమంలో ఎస్సై ఉమేశ్‌చం ద్ర, మెస్‌ ఇన్‌చార్జిగా ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ స్టీఫెన్‌ను మెనూ (సమ్మరీ)లో వివరాలు, బిల్లు ల గురించి ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన స్టీఫెన్‌ ఏకే 47 గన్‌తో ఎస్సై ఉమేశ్‌చంద్రపై 4 రౌండ్ల కాల్పులు జరపగా.. ఛాతీ భాగంలో రెండు, పొట్ట భాగంలో రెండు బుల్లెట్లు దిగా యి.
చదవండి: బాత్‌రూంలో ఉరివేసుకొని బాలింత ఆత్మహత్య

దీంతో ఉమేశ్‌చంద్ర రక్తపు మడుగులో కుప్పకూలాడు. సహచరులు దగ్గరకు వచ్చేసరి కి స్టీఫెన్‌ కూడా అదే తుపాకీతో తన దవడ కిం ద కాల్చుకోగా.. అతని ఎడమ కణత నుంచి బుల్లెట్‌ బయటకు వెళ్లింది. దాదాపు 25 నిమిషాల్లోనే ఇదంతా జరిగిపోయింది. ఈ ఘటన తో షాక్‌కు గురైన సీఆర్‌పీఎఫ్‌ అధికారులు అప్రమత్తమై సివిల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.  వారిద్దరినీ హుటాహుటిన ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఎస్సై ఉమేశ్‌చంద్రను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పారు. హెడ్‌ కానిస్టేబుల్‌ స్టీఫెన్‌కు ప్రాథమిక చికిత్స అందించి మొదట వరంగల్‌కు, ఆపై విషమం గా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మృతి చెందిన ఎస్సై ఉమేశ్‌చంద్రది బిహార్‌ రాష్ట్రం సమస్తిపూర్‌ జిల్లా ఇన్వత్‌పూర్‌ గ్రామం కాగా, గాయపడిన హెడ్‌కానిస్టేబుల్‌ స్టీఫెన్‌ది తమిళనాడు రాష్ట్రం అని తెలిసింది.  

ఆస్పత్రిని సందర్శించిన ఎస్పీ 
సీఆర్‌పీఎఫ్‌ ఎస్సై ఉమేశ్‌చంద్ర మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ములుగు ఎస్పీ సం గ్రామ్‌సింగ్‌ పాటిల్‌ ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహంపై బుల్లెట్‌ గాయాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్‌కుమార్, సీఐ కిరణ్‌కుమార్, వెంకటాపురం(కె) సీఐ శివప్రసాద్, ఎస్సై తిరుపతి.. ఉమేశ్‌చంద్ర మృతదేహాన్ని వరంగల్‌కు తరలించారు. 
చదవండి: నగరానికి నయా పోలీస్‌ బాస్‌.. సీవీ ఆనంద్‌ గురించి ఆసక్తికర విశేషాలు..

మరిన్ని వార్తలు