‘ఇసుక‘ దొంగల ముఠాల మధ్య కాల్పులు.. నలుగురు మృతి

29 Sep, 2022 16:05 IST|Sakshi

పాట్నా: ఇసుక అక్రమ రవాణాలో రెండు ముఠాల మధ్య తలెత్తిన వివాదం కాల్పుల వరకు వెళ్లింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరపటంతో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బిహార్‌లోని బిహ్తా నగరంలో గురువారం జరిగింది. సన్‌ రివర్‌ నుంచి అక్రమంగా ఇసుక తరలించటంలో రెండు గ్రూపులు నిమగ్నమయ్యాయి. ఈ విషయంపైనే మాటా మాటా పెరిగి దాడులు చేసుకున్నాయి. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తూటాలు తగిలి నలుగురు అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు. సెప్టెంబర్‌ 13న బిహార్‌లోని బెగుసరాయ్‌లో జాతీయ రహదారులు 28, 31పై బైక్‌పై వచ్చి కాల్పులు జరిపిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనల్లో ఒకరు మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. కొద్ది రోజుల్లోనే ఇలా రెండు ముఠాలు కాల్పులు జరపటం గమనార్హం.

ఇదీ చదవండి: డ్రగ్స్‌ ముఠాలపై సీబీఐ ‘ఆపరేషన్‌ గరుడ’.. 175 మంది అరెస్ట్‌

మరిన్ని వార్తలు