చిరుతపులి పిల్లను చంపి వండుకు తిన్నారు 

25 Jan, 2021 07:28 IST|Sakshi

సాక్షి, చెన్నై: చిరుతపులి పిల్లను చంపి, ఆ మాంసాన్ని వండుకు తిన్న ఐదుగురు వేటగాళ్లను తమిళనాడులోని నీలగిరి జిల్లా అటవీ శాఖ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు.అటవీ గ్రామంలోకి దారి తప్పి వచ్చిన ఓ చిరుతపిల్లను  కొందరు వ్యక్తులు వేటాడి హతమార్చినట్టు శనివారం అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులకు అక్కడి ఓ పంట పొలంలో చిరుతపులిని వేటాడిన ఆనవాళ్లు లభించాయి. విచారణను వేగవంతం చేయగా ఆదివారం ఉదయం అదే ప్రాంతానికి చెందిన వినోద్, కురియ, బిను, కుంజప్పన్, విన్సంట్‌లను అరెస్టు చేశారు. వారంతా కలసిదాని మాంసాన్ని వండుకొని తిన్నట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు