Prostitution Racket Busted In Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం, ఐదుగురి అరెస్టు

17 Jun, 2022 07:27 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

హస్తినాపురం: సెలూన్, స్పా ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాంగళ్య షాపింగ్‌మాల్‌కు ఎదురుగా ఉన్న యూనిసెక్స్‌ సెలూన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందింది.

ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు సెలూన్‌ స్పాపై గురువారం దాడి చేసి ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 సెల్‌ఫోన్‌లు, రూ.2,100ను స్వాధీనం చేసుకుని వారిని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేచుకుని వారిని రిమాండ్‌కు తరలించారు. 

చదవండి: (Hyderabad: ఎవరికైనా చెబితే చంపేస్తా.!) 

మరిన్ని వార్తలు