భారీ ఎన్‌కౌంటర్‌: ఐదుగురు మావోయిస్టులు మృతి

29 Mar, 2021 12:45 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ తెలిపారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని చెప్పారు. పోలీసులు అదనపు బలగాలతో కూంబీంగ్ ఆపరేషన్ చేపట్టారని, తప్పించుకున్న వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. నక్సల్స్‌ను మొత్తం ఏరివేసేవరకు ఈ ఆపరేషన్‌ కొనసాగుతుందని ఎస్పీ పేర్కొన్నారు.


చదవండి: హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు: ఎనిమిది మంది దుర్మరణం

మరిన్ని వార్తలు