దారుణం: ప్రియుడి కామవాంఛకు ఐదేళ్ల కుమార్తె బలి

24 Apr, 2021 00:00 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తను, సొంతూరును వదిలి పొరుగు రాష్ట్రానికి చేరుకుంది. ప్రియుడి కామవాంఛకు ఐదేళ్ల కుమార్తె బలైపోగా ఊరుకాని ఊరులో ఆ తల్లి ఒంటరిగా మిగిలింది. తమిళనాడు రాష్ట్రం విరుదునగర్‌ జిల్లా రాజపాళయంకు చెందిన ఒక యువతికి వివాహమై భర్త, ఐదు ఏళ్లు, మూడేళ్ల వయసునన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ వివాహితకు అదే ప్రాంతానికి చెందిన అలెక్స్‌ (26) అనే యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం భర్తకు తెలిసి మందలించినా భార్య పట్టించుకోలేదు. దీంతో విసుగుచెందిన భర్త మూడేళ్ల కుమార్తెను తీసుకుని వేరుగా వెళ్లిపోయారు.

భార్య తన ఐదేళ్ల కుమార్తెతో అలెక్స్‌ వద్దకు చేరుకుని కేరళ రాష్ట్రం పత్తనంతిట్టా జిల్లాలో అద్దె ఇల్లు తీసుకుని ఉంటోంది. ఇద్దరూ కూలీ పనికి వెళ్లేవారు. ఆరో తేదీన యువతి కూలీ పనికి వెళ్లగా అలెక్స్‌ మద్యం, గంజాయి సేవించి ఇంటికి చేరుకుని ఒంటరిగా ఉన్న యువతి కూతురిపై అత్యాచార యత్నం చేశాడు. బాలిక ప్రతిఘటించి కేకలు వేయడంతో కత్తితో విచక్షణారహితంగా ఒళ్లంతా పొడిచి తన కామవాంఛను తీర్చుకున్నాడు.

తర్వాత ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఒళ్లంతా కత్తి గాయాలతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. సాయంత్రం కూలీ పనిముగించుకుని ఇంటికి వచ్చిన ఆ తల్లి నిస్తేజంగా రక్తపుమడుగులో పడి ఉన్న కుమార్తెను చూసి నిర్ఘాంతపోయింది. బాలికను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలిక మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న అలెక్స్‌ను పోలీ సులు పట్టుకుని విచారించగా లైంగికదాడికి పాల్పడినట్లు నేరం అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి అలెక్స్‌ను అరెస్ట్‌చేశారు.  
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు