విషాదం: అదృశ్యమైన బాలుడు మృతి

15 Jan, 2021 10:10 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని దేవుని పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.. సాయి సద్గురు కాలనిలో పండుగ పూట పతంగులు ఆడుకుంటూ ఇంటినుంచి వెళ్లిన నిశాంత్ అనే ఆరేళ్ల ఏళ్ల బాలుడు నిన్న అదృశ్యం అయ్యి  ఇవాళ ఇంటి సమీపంలొని మురికి కాలువలో శవం అయి కనిపించాడు. బాలుడు మృతితో సాయి సద్గురు కాలనిలో విషాదఛాయలు అలముకున్నాయి. దేవుని పల్లి గ్రామంలోని సాయి సద్గురు కాలనిలో మధుకృష్ణ, సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల బాలుడు నిశాంత్, మూడేళ్ల మరో బాబు ప్రజ్వల్ ఉన్నారు. మధుకృష్ణ, సుజాత లు టీచర్లు గా పని చేస్తున్నారు. చదవండి: మొదటి రాత్రే ఉరివేసుకున్న వరుడు

సంక్రాంతి పండుగ కావడం తో నిశాంత్ గాలిపటాలు ఎగురవేసేందుకు మధ్యాహ్నం సమయం లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. రాత్రి అయిన నిశాంత్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అనంతరం కుటుంబ సభ్యులు దేవునిపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. ఇంటి పక్కన గల మురికి కాలువలో నిశాంత్ మృత దేహం కనిపించడంతో షాక్ కు గురయ్యారు.. మురికి కాలువలో పడి నిశాంత్ మృతి చెందడం తో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. చదవండి:హైదరాబాద్‌ లో సంచలనం రేపిన కిరాతక హత్య

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు