జీఎస్టీ అధికారుల కిడ్నాప్‌ ఉదంతంపై కేం‍ద్రం సీరియస్‌.. కఠినచర్యలు తీసుకోవాలన్న ఆర్థిక మంత్రి

5 Jul, 2023 17:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సరూర్‌ నగర్‌ పరిధిలో జీఎస్టీ అధికారుల కిడ్నాప్‌.. పోలీసులు ఆ కేసును చేధించిన ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ నిర్మలా సీతారామన్‌.. అధికారుల కిడ్నాప్‌ ఘటనపై తెలంగాణ పోలీసులను ఆరా తీశారు. అధికారుల కిడ్నాప్‌ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌, పోలీస్‌ కమిషనర్‌లను ఫోన్‌లో కోరారు. 

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. జీఎస్టీ కట్టని షాప్‌ను సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి ఆఫీసర్‌ మణిశర్మ, మరో అధికారి ఆనంద్‌లను.. దుకాణదారు, మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్ చేశాడు. అయితే ఆగమేఘాలపై స్పందించిన పోలీసులు కిడ్నాపర్లను వెంటాడి అధికారులను రక్షించారు.  కిడ్నాప్‌కు పాల్పడిన నిందితులు ఫిరోజ్, ముజీఫ్, ముషీర్, ఇంతియాజ్‌లను అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. 

ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ మీడియాతో మాట్లాడుతూ..  శ్రీకృష్ణా నగర్‌లో ఫేక్ జీఎస్టీ నంబర్‌తో gst కట్టని ఒక స్క్రాప్ గోదాంను సీజ్ చేసేందుకు..GST ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్‌ మణి శర్మ , ఆనంద్ లు వెళ్లారు. ఆ సమయంలో షాప్ నిర్వాహకుడు , మరో ముగ్గురు కలిసి... ఫార్చ్యూనర్ కార్ లో కిడ్నాప్ చేశారు. GST అధికారుల ఐడీ కార్డు లు చింపి..వారి పై దాడి చేశారు. మాకు సమాచారం అందగానే... దిల్‌సుఖ్‌ నగర్ రాజీవ్ చౌక్ వద్ద కిడ్నాపర్స్ ను అదుపులోకి తీసుకున్నాము. ఒక నిందితుడు ఖాయూం పరారీలో ఉన్నాడు.  కేసు దర్యాప్తు చేస్తున్నాం అని డీసీపీ వెల్లడించారు.

ఇదీ చదవండి: జీఎస్టీ అధికారి కిడ్నాప్‌.. నిందితులు టీడీపీ నేత అనుచరులు?

మరిన్ని వార్తలు