ఉద్యోగాల పేరిట మోసం.. మాజీ మంత్రి అరెస్టు 

6 Jan, 2022 13:45 IST|Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): ఉద్యోగాల పేరిట రూ. 3 కోట్ల కేసులో మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీని విరుదునగర్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అన్నాడీఎంకే హయంలో పాడి పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కేటీ రాజేంద్రబాలాజీ మీదున్న ఆరోపణలు, నమోదైన కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఆవిన్‌సంస్థలో ఉద్యోగాల పేరిట రూ. 3 కోట్లు ఆయన మోసం చేసిన వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగానే పరిగణించారు.

ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించి భంగ పడ్డ రాజేంద్ర బాలాజీ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు గత నెల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కోసం 8 బృందాలు రంగంలోకి తీవ్రంగా గాలిస్తూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు శివారులోని ఓ ఫామ్‌ హౌస్‌లో తలదాచుకుని ఉన్న ఆయన్ను విరుదునగర్‌ పోలీసులు బుధవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. అనంతరం అక్కడి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాలతో విరుదునగర్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు