తలపై గన్‌ గురిపెట్టి రేప్‌.. మాజీ సీఐ నాగేశ్వర రావు రేపిస్టే: పోలీసుల ధృవీకరణ!

22 Aug, 2022 08:50 IST|Sakshi
మాజీ సీఐ నాగేశ్వర రావు

సాక్షి, హైదరాబాద్: ఓ నిందితుడి భార్యపై హైదరాబాద్‌లోని మారేడుపల్లి ఠాణా మాజీ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ) కోరట్ల నాగేశ్వరరావు అత్యాచారం చేశాడని వనస్థలిపురం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితురాలితో తనకు వివాహేతర సంబంధం ఉందని కస్టడీ సమయంలో పలుమార్లు బుకాయించిన మాజీ సీఐ నాగేశ్వర రావును లైంగిక సామర్థ్య (పొటెన్సీ) పరీక్షలు నిర్వహించగా అందులో వైద్యులు ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో పాటూ మెజి్రస్టేట్‌ సమక్షంలో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన మహిళా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు (ఎస్పీ) స్థాయి అధికారిణి.. నిందితుడు బాధితురాలి కణతపై తుపాకీ పెట్టి అత్యాచారం చేశాడని, తగిన ఆధారాలతో సహా తుది నివేదిక సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న పలువురి స్టేట్‌మెంట్లను రికార్డు చేసి, సాధ్యమైనంత త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు వనస్థలిపురం పోలీసులు కసరత్తు చేస్తున్నారు. 

తుపాకీ తీసుకెళ్లలేదన్నది నాటకమే.. 
వృత్తిరీత్యా సీఐ కావటంతో తుపాకీ క్యారీ చేసే అలవాటు ఉన్న నాగేశ్వర రావు సంఘటన జరిగిన రోజు కూడా బాధితురాలి ఇంటికి గన్‌ తీసుకెళ్లాడు. కస్టడీ విచారణలో మాత్రం తాను తుపాకీ తీసుకెళ్లలేదని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. కావాలంటే మారేడుపల్లి ఠాణా రికార్డులను పరిశీలించుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో పీఎస్‌ రికార్డులను, సీసీటీవీ కెమెరాలను, ఇతరత్రా సాంకేతిక అంశాలను పరిశీలించిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. సంఘటన జరిగిన మర్నాడు ఉదయం తుపాకీ స్టేషన్‌లోని ఒక అధికారికి ఇచ్చి, సరెండర్‌ చేసినట్లుగా రికార్డ్‌లో రాపించినట్లు విచారణలో బయటపడింది. ఠాణాలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. సంఘటన జరిగిన తెల్లారి నాగేశ్వర రావు స్టేషన్‌కు వచి్చనట్లు ఎక్కడా రికార్డు కాలేదు. దీంతో సీఐ ఫోన్‌ లొకేషన్‌ను పరిశీలించగా.. ఆ సమయంలో నాగేశ్వర రావు ఇంట్లోనే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. దీంతో కేసును తప్పుదారి పట్టించే యత్నం చేసిన నాగేశ్వర రావుపై వనస్థలిపురం పోలీసులు తప్పుడు డాక్యుమెంట్లు, సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులు కూడా నమోదు చేశారు. 

రూ.30 లక్షలు డిమాండ్‌.. 
బాధితురాలితో తనకు వివాహేతర సంబంధం ఉందని నిరూపించే ఆధారాలు సమరి్పంచడంలో సీఐ విఫలమయ్యాడని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. సీఐ ఫోన్‌ కాల్‌ రికార్డ్‌లను పరిశీలిస్తే.. ఎక్కడా కూడా బాధితురాలితో సంభవించినట్లు నమోదు కాలేదని పేర్కొన్నారు. ఇదే విషయంపై సీఐను ప్రశ్నించగా.. బాధితురాలితో కేవలం వాట్సాప్‌ కాల్, మెసేజ్‌లు మాత్రమే చేసేవాడినని తెలిపినట్లు తెలిసింది. బాధితురాలి ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామని, నివేదిక ఇంకా రాలేదని వివరించారు. బాధితురాలి భర్తపై ఉన్న కేసులు ట్రయల్‌కు రానున్నాయని, దీన్ని ఆసరాగా చేసుకొని ఆమెను లోబరుచుకోవాలని భావించిన సీఐ.. వివాహిత ఇంటికి వెళ్లి ఉంటాడని ఓ పోలీసు ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. అంతేతప్ప డీసీపీ స్థాయి అధికారి ఒకరు నాగేశ్వరరావుపై వ్యక్తిగత కక్షతో ఆయన్ని ఇరికించాడని వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఆయన తెలిపారు. కాగా.. సంఘటన జరిగిన తర్వాత అవతలి పార్టీ సీఐను రూ.30 లక్షలు డిమాండ్‌ చేశారనే ఆరోపణలు కూడా వినిపించాయని ఆయన పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు