పాసు పుస్తకాలకెళ్తే.. ఆర్‌ఐకి రూ. 35 లక్షల అప్పు

20 Aug, 2020 12:38 IST|Sakshi

కీసర తహసీల్దార్‌ నాగరాజుపై కలెక్టర్‌కు రైతు ఫిర్యాదు 

సాక్షి, మేడ్చల్‌: కొత్త పాసు పుస్తకాల కోసం అప్పటి కీసర తహసీల్దార్‌ నాగరాజు ఆశ్రయించగా, ఆర్‌ఐ కిరణ్‌ ఇళ్లు నిర్మించుకుంటున్నాడని రూ.35 లక్షలు అప్పు ఆయనకు ఇప్పించి, ఇప్పటి వరకు ఇవ్వలేదని కీసర దాయారకు చెందిన రైతు కుంటోళ్ల దశరథ తెలిపారు. మా రాంపల్లి దాయార గ్రామానికి సంబంధించిన భూముల వ్యవహారంలో పాసు పుస్తకాల జారీ విషయంపై రియల్టర్‌ బ్రోకర్ల నుంచి రూ. 1.10 కోట్లు లంచం తీసుకుంటూ... ఏసీబీకి చిక్కటంతో ఆయన లంచావతారం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.

గతంలోనే డబ్బులివ్వాలని తహసీల్దార్‌ నాగరాజుకు వద్దకు వెళ్లితే... తనపై అక్రమంగా 353 ఐపీసీ కింద కేసు నమోదు చేయించి తీవ్రంగా వేధించారని దశరథ తెలిపారు. కీసర దాయార గ్రామంలో 173, 174, 175, 176, 179, 213 సర్వే నంబర్లలో తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించిన కొత్త పాసు పుస్తకాల కోసం నాగరాజును తరచు కలిసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పాసు పుస్తకాలు ఇవ్వకపోగా ఆర్‌ఐ కిరణ్‌కు ఇప్పించిన రూ. 35 లక్షలు ఇవ్వలేదన్నారు. ఈ విషయమై జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టర్‌ సకాలంలో స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. కొత్త పాసు పుస్తకాలు కూడా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.   

ఏసీబీకి పట్టుబడ్డ వెంకటేశ్వరరెడ్డి:
రంగారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కోనసాగుతున్నాయి. సర్వేయర్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరెడ్డిపై అధికారలు తనిఖీలు నిర్వహించారు. రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి వెంకటేశ్వరరెడ్డి రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయన సర్వే రిపోర్టు ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు