భర్త పాయిజన్‌ తీసుకుని చనిపోవడంతో భార్య..

2 Mar, 2023 11:23 IST|Sakshi

భార్యభర్తలిద్దరు ఒకరు తరువాత ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. భర్త చనిపోయిన కొద్ది క్షణాల్లోనే ఆయన లేని జీవితం తనకూ వద్దంటూ మృతుడి భార్య కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అజయ్‌ పాల్‌(37), మౌనిక (32) ఇద్దరు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

బుధవారం మౌనిక పాల్‌ భర్త నోటి నుంచి నురగతో స్ప్రుహ తప్పి పడిపోయాడు. దీంతో మౌనిక భర్తను హుటాహుటినీ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అక్కడ వైద్యులు ఆమె భర్త చనిపోయినట్లు ధృవీకరించారు. దీన్ని జీర్ణించుకోలేని మౌనిక వెంటనే ఇంటికి వచ్చి పాయిజన్‌ తీసుకుని అదే రోజు మధ్యాహ్నాం చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు పగలుగొట్టి చూడగా.. మౌనిక విగతజీవిగా పడి ఉంది.

దీంతో పోలీసులు ఆమె మృతదేహా​న్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో ఆమె భర్త ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫీసర్‌ని, ఇటీవలే అతను ఎయిర్‌ ఫోర్స్‌ జాబ్‌ నుంచి వైదొలగినట్లు వెల్లడించారు పోలీసులు. పైగా ఆ జంటకు రెండేళ్ల క్రితమే వివాహం అయ్యిందని తెలపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు దారితీసిన బలమైన కారణాల గురించి సమగ్రంగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

(చదవండి: మాఫియాపై ఉక్కుపాదం..ఉమేష్‌ పాల్ హత్య కేసు నిందితుల నివాసాలు బుల్‌డోజర్లతో కూల్చివేత)

మరిన్ని వార్తలు