వంద రూపాయల కోసం మాజీ వైస్‌ చాన్సలర్‌ దారుణ హత్య

27 Jun, 2021 21:05 IST|Sakshi
ధూర్బరాజ్‌ నాయక్‌, మాజీ వైస్‌ చాన్సలర్‌(ఫైల్‌ ఫోటో)

భువనేశ్వర్‌: వంద రూపాయలు అడిగితే ఇవ్వలేదని మాజీ వైస్‌ చాన్సలర్‌ను దారుణ హత్య చేసిన ఘటన ఆదివారం ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాలు.. జార్సుగూడకు చెందిన ‍ప్రొఫెసర్‌ ధూర్బరాజ్‌ నాయక్‌ సంబల్పూర్‌ యునివర్సిటీలో వైస్‌ చాన్సలర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. కాగా ఆదివారం ఉదయం నాయక్‌ పనిమీద ఆయన బయటికి వెళ్లారు. ఇంట్లో ఆయన భార్య, కూతురు, అల్లుడు  వేరే గదుల్లో ఉన్నారు. కాగా మధ్యాహ్నం ఊళ్లో నుంచి కొంతమంది యువకులు వచ్చి నాయక్‌ ఇంట్లోకి చొరబడ్డారు. నేరుగా నాయక్‌ రూంకి వెళ్లి తనిఖీలు చేస్తుండగా.. నాయక్‌ పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. నాయక్‌ను చూసిన ఆ యువకులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

అయితే అతను అందుకు ఒప్పుకోకపోవడంతో కనీసం వంద రూపాయలైనా ఇవ్వాలంటూ అతనిపై దౌర్జన్యం చేశారు. దీంతో నాయక్‌, ఆ యువకులు మధ్య తోపులాట జరగ్గా.. ఆ యువకుల్లో ఒక వ్యక్తి అక్కడే ఉన్న గొడ్డలిని తీసుకొని నాయక్‌ మెడపై నరికాడు. దీంతో నాయక్‌ అక్కడే కుప్పకూలగా.. వారు అక్కడినుంచి పారిపోయారు. వేరే గదిలో ఉన్న ఆయన భార్య వచ్చి నాయక్‌ను తన అల్లుడు సాయంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రికి తరలించిన కాసేపటకే ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్లు జార్సుగూడ ఎస్పీ బీసీ దాస్ తెలిపారు. 

చదవండి: 57 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. రెండో భార్య ఏంచేసిందంటే..

హైటెక్‌ సిటీలో కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌పై ఎగిరిపడ్డ ఆటో

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు