వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

4 Oct, 2020 11:13 IST|Sakshi

దివ్యాంగుడి హత్య

కేసును ఛేదించిన పోలీసులు

నలుగురు నిందితుల అరెస్ట్‌  

చిల్లకూరు(నెల్లూరు జిల్లా): కలవకొండకు చెందిన దివ్యాంగుడైన చేజర్ల సుబ్రహ్మణ్యం హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భార్య ప్రియుడు మరో ముగ్గురితో కలిసి హత్యకు పాల్పడ్డాడు.  ఈ కేసులో  నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు  గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం చిల్లకూరు పోలీస్‌ స్టేషన్‌లో  హత్య కేసు వివరాలను డీఎస్పీ విలేకరులకు వెల్లడించారు.  కలవకొండకు చెందిన చేజర్ల సుబ్రహ్మణ్యం (38) దివ్యాంగుడు. ఇంటి వద్ద టైర్లకు పంక్చర్లు వేస్తూ జీవనం సాగించేవాడు. అతని భార్యకు సిలికా మైన్‌లో పని చేసే క్రమంలో ఉడతావారిపాళేనికి చెందిన ఈతముక్కల కాటయ్యతో పరిచయం ఏర్పడింది. అది  కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో సుబ్రహ్మణ్యాన్ని అడ్డు తప్పించేందుకు కాటయ్య గతంలో తనకు పరిచయం ఉన్న గూడూరుకు చెందిన అత్తిప ట్టు బాలాజీని సంప్రదించాడు. అతను తన వల్ల కాదని గూడూరుకు చెందిన ఓ మైనర్‌కు విషయం తెలియజేశాడు.

సదరు యువకుడు సూళ్లూరుపేటలోని హోలీక్రాస్‌ ప్రాంతంలో మెకానిక్‌గా పనిచేస్తు న్న మరో మైనర్‌కు సమాచారం ఇచ్చాడు.  సెపె్టంబరు 26న ముగ్గురు కలిసి హత్యకు పథకం పన్నారు. కాటయ్యతో రూ.40 వేలకు ఒప్పందం చేసుకున్నారు. 27న అర్ధరాత్రి కలవకొండకు నలుగురు చేరుకుని పూటుగా మద్యం సేవించారు. అనంతరం సుబ్రహ్మణ్యం ఇంటికి మెకానిక్‌ వెళ్లాడు. రాయితో తలుపును కొట్టి తిరిగి వచ్చి సమీపంలోని బస్‌షెల్టర్‌లో తలదాచుకున్నాడు. సుబ్రహ్మణ్యం బయటకు వచ్చి చూడగా ఎవ్వరూ కనిపించలేదు. అప్పటికే వేకువజాము కావడంతో కుటుంబ సభ్యులకు చెప్పి బహిర్భూమికి బయలుదేరాడు. ఇదే అదునుగా మెకానిక్‌ కత్తితో సుబ్రహ్మణ్యంపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నలుగురు కలిసి పరారయ్యా రు.

తన బాబాయి సుబ్రహ్మణ్యాన్ని గుర్తుతెలియని వ్యక్తులు  హత్య చేసినట్లు శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం  గూడూరు ఎస్‌ఆర్‌ఏ టాకీస్‌ సమీపంలో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. రెండు సెల్‌ఫోన్లు, రెండు కత్తులను స్వా«దీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుల్లో కాట య్య, బాలాజీను గూడూరు కోర్టుకు , మైనర్లను నెల్లూరులో ని బాల నేరస్తుల కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు. కేసును వేగవంతగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్న గూడూరు రూరల్, వాకాడు సీఐలు శ్రీనివాసులరెడ్డి, కే నరసింహారావు,ఎస్సై బ్రహ్మనాయుడు, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు రాజు, ఆదినారాయణను డీఎస్పీ అభినందించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా