ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు; నలుగురు మృతి

4 Jul, 2021 16:15 IST|Sakshi
గురుదాస్‌పూర్ డీఎస్పీ హర్‌కిషన్‌

అమృత్‌స‌ర్‌: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో సుఖ్వీంద‌ర్‌సింగ్ సోనీ మంగల్‌ సింగ్‌ అనే వ్య‌క్తి ఇంట్లోకి చొరబడి కుటుంబంలోని ఆరుగురు వ్య‌క్తుల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల్లో మంగల్‌సింగ్‌తో పాటు ఒక కుమారుడు అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా, మ‌రో కుమారుడు సహా మనుమడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

కాగా ఘ‌ట‌న‌కు సంబంధించి స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడి కోసం ప‌లు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేప‌ట్టారు. అయితే ఇరు కుటుంబాల మధ్య భూతగాదాల నేపథ్యంలో సుఖ్వీందర్‌సింగ్‌ పగ పెంచుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గురుదాస్‌పూర్ డీఎస్పీ హర్‌కిషన్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు