విషాదం: గడ్డివాములో కుటుంబం అంతా ఆహుతి 

22 Aug, 2021 07:12 IST|Sakshi
ఆహుతైన కుటుంబం (ఫైల్‌)

సాక్షి, చెన్నై: హతమార్చి దహనం చేశారా..? లేదా బలవన్మరణానికి పాల్పడ్డారా..? కారణమేమైనా.. ఓ కుటుంబం గడ్డివాములో కడతేరిపోయింది. ముగ్గురి మృతదేహాలు ఆహుతి కావడం, మరొకరి మృతదేహం సగం కాలి ఉండడం మిస్టరీగా మారింది. శనివారం దిండుగల్‌ జిల్లా పళనిలో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలు.. దిండుగల్‌ జిల్లా పళని సమీపంలోని వత్తగౌండం వలసకు చెందిన చిన్న రాజా అలియాస్‌ మురుగేషన్‌(52) రైతు. ఇతడికి పళని సంతలో దుకాణం కూడా ఉంది. ఆయనకు భార్య వలర్మతి(45), శివరంజని(21) కుమార్తె, కార్తికేయన్‌(18) కుమారుడు ఉన్నారు.

చదవండి: తాలిబన్లకు మద్దతిచ్చిన 15 మంది అరెస్టు

పిల్లలు ఇద్దరు పళని, ఒట్టన్‌చత్రంలోని కళాశాలల్లో బీఎడ్, బీకాం చదువుకుంటున్నారు. పంట పొలంలోనే చిన్న ఇల్లు కట్టుకుని ఈ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో శనివారం ఉదయాన్నే ఆ ఇంటి ముందు ఉన్న గడ్డివాము, పక్క నే ఉన్న జొన్న పంట తగల బడుతుండటాన్ని సమీ పంలోని రైతులు గుర్తించారు. మురుగేషన్‌కు సమాచారం ఇచ్చేందుకు ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు.  

ఆహుతైన స్థితిలో..
సమాచారం అందుకున్న ఆయకుడి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు.అయితే, గడ్డివాములో సగంకాలిన స్థితిలో మురుగేషన్‌ మృత దేహం, పూర్తిగా కాలిన స్థితిలో మిగిలిన ముగ్గురి మృతదేహాలు బయటపడడం తీవ్ర కలకలం రేపింది. దిండుగల్‌ ఐజీ అన్భు, డీఐజీ విజయకుమార్, ఎస్పీ శ్రీనివాసన్, డీఎస్పీ శివకుమార్‌ నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుని విచారణ చేపట్టింది. ఇంట్లో అక్కడక్కడ రక్తపు మరకలు, చిందర వందరగా వస్తువులు పడి ఉండడంతో ఇది హత్యగా అనుమానించారు.

చదవండి: ప్రేమ పేరుతో వంచించి.. నగ్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. 

అయితే, అక్కడకు ఇతర వ్యక్తులు వచ్చి వెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. మృతదేహాల్ని పోస్టుమార్టం చేయగా, నలుగురు విషం తాగి ఉన్నట్లు తేలడంతో ఈ కేసు పోలీసులకు ఓ సవాల్‌గా మారింది. భార్య, పిల్లలకు విషం ఇచ్చి హతమార్చినానంతరం, గడ్డివాములో పడేసి మురుగేషన్‌ నిప్పు పెట్టి ఉండ వచ్చని పోలీసులు  భావిస్తున్నారు.

చదవండి: 200 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

చివరకు తాను ఆ విషం సేవించి మంటల్లో ఆహుతై ఉండ వచ్చని , అందుకే అతడి మృతదేహం సగమే కాలినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే, కుటుంబం అంతా బలన్మరణానికి పాల్పడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ చేదింపునకు ఆయకుడి పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 

మరిన్ని వార్తలు