మూడెకరాల కోసం నాలుగు హత్యలు

30 Aug, 2021 12:51 IST|Sakshi

రాయచూరు రూరల్‌: కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లాలో భూ వివాదం నలుగురి హత్యకు దారితీసింది.  మూడు ఎకరాల కోసం ఈ ఘోరం జరిగింది. వివరాలు... భాగల్‌కోటె జిల్లా జమఖండి తాలూకా మధురఖండిలో రెండు కుటుంబాల మధ్య ఆస్తి వివాదం ఉంది. ధార్వాడ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో శనివారం రాత్రి పొలంలో ఉన్న అన్నదమ్ములు హన్మంతు (48), మల్లప్ప (44), ఈశ్వర్‌ (40) బసవరాజ్‌ (36)లను వరుసకు బంధువులైన పుటాణి కుటుంబ సభ్యులు మారణాయుధాలతో హతమర్చారు.

కోర్టు తీర్పు ఆలస్యం అవుతుండటంతో శనివారం రాత్రి కాపుగాచి నలుగురిని కిరాతకంగా చంపేశారు. దీంతో జమఖండి పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: Karnataka: బాలికతో అసభ్య ప్రవర్తన.. నడిరోడ్డుపై  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు