బెడిసికొట్టిన ఫ్రాంక్‌ షో

13 Jan, 2021 06:40 IST|Sakshi
పోలీసులు అరెస్టు చేసిన దినేష్‌, అజీం బాచ్చా, అజయ్‌

సాక్షి, చెన్నై: ఫ్రాంక్‌ షో పేరిట అశ్లీల ప్రశ్నల్ని అడిగిన ఓ యూ ట్యూబ్‌ చానల్‌ అడ్డంగా బుక్కైంది. ఆ నిర్వాహకుడు సహా ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చెన్నై టాక్స్‌ పేరిట పుట్టుకొచ్చిన ఓ యూ ట్యూబ్‌ చానల్‌ ఫ్రాంక్‌ పేరిట నిర్వహించిన ఓ షోతో అడ్డంగా బుక్కయ్యారు. ముందుగా తామే ఎంపిక చేసుకున్న ఓ యువతి ద్వారా అశ్లీల ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. అదే ప్రశ్నల్ని మరికొందరి యువతులను అడుగుతూ సమాధానాలు రాబట్టే యత్నం చేసి అడ్డంగా బుక్కయ్యారు. వీరు అడిగిన ప్రశ్నలు ఆ మేరకు అశ్లీలంగా ఉండడంతో బీసెంట్‌నగర్‌లో చిత్రీకరణ సాగుతున్న సమయంలో స్థానికులు అడ్డుకున్నారు.

పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఆ యూ ట్యూబ్‌ చానల్‌ అంతా అశ్లీలంతో కూడిన ప్రశ్నలు, సమాధానాలు, షోలు ఉండడంతో పోలీసులు కన్నెర్ర చేశారు. ఆ చానల్‌ నిర్వహిస్తున్న దినేష్‌ను, చేతిలో గొట్టం, కెమెరాతో నగరంలో చక్కర్లు కొడుతూ యాంకర్‌ అజీం బాచ్చా, కెమెరామన్‌ అజయ్‌బాబులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ చానల్‌ను నిషేధించాలని యూ ట్యూబ్‌కు సిఫారసు చేశారు.

మరిన్ని వార్తలు