నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసు: మరో ముగ్గురు అరెస్టు

16 Sep, 2021 08:15 IST|Sakshi

నల్లగొండ: నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసు: మరో ముగ్గురు అరెస్టు జిల్లాలోని మున్సిపాలిటీలో నిధులు స్వాహా చేసిన ఉదంతంలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కాగా,ఈ ఘటనలో తాజాగా మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 2015లో వెలుగు చూసిన 5.04 కోట్ల అవినీతి బయటపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా, బిల్‌ కలెక్టర్‌ బిక్షం, ఎన్‌ఆర​ఎం, భానుకుమార్ రెడ్డి, కార్యాలయ సబార్డినేటర్‌ ముంత మల్లేషాన్ని అరెస్టు చేశారు.

విడతల వారిగా అరెస్టులు చేయడంతో తప్పించకునేందుకు బెయిల్‌ కోసం మిగతా ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత మంది అధికారులు తమ ఫోన్‌లను స్విచ్‌ఆఫ్‌చేసుకుని సెలవుల్లో వెళ్లిపోయారు. మొత్తం 29 మంది ఉద్యోగులపై కేసు నమోదుకాగా వారిలో ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం 26 మందిపై విచారణ కొసాగుతోంది. వీరిలో ఆరుగురు అరెస్టు కాగా, ఇంకా 20 మంది అరెస్టు కావాల్సి ఉంది. కాగా, మరికొంత మంది ఉన్నతాధికారుల పలుకుబడి ఉపయోగించుకుని అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: Nalgonda: మున్సిపాలిటీలో నిధులు స్వాహా.. ముగ్గురు అరెస్ట్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు