కారు బహుమతిగా వచ్చిందని సంబర పడిపోయారు.. చివరికి బిగ్‌ ట్విస్ట్‌

29 Sep, 2022 13:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆత్మకూరు(నెల్లూరు జిల్లా): మహేంద్ర కంపెనీ కారు బహుమతిగా వచ్చిందని సమాచారం తెలిపి రూ.59 వేల నగదును కాజేసిన వైనమిది. బుధవారం బాధితుల వివరాల మేరకు ఆత్మకూరు పట్టణంలోని పడమరవీధి మసీదు ప్రాంతానికి చెందిన కిర్మాణి జమీర్‌ చెల్లెలు హఫీజాకు ఇటీవల మహేంద్ర కంపెనీ కారు బహుమతిగా వచ్చిందని పోస్ట్‌ ద్వారా స్క్రాచ్‌కార్డు వచ్చింది. ఇతర వివరాలకు ఫోన్‌ నంబరులో సంప్రదించాలని కోరారు.
చదవండి:  షాకింగ్‌ ఘటన.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను ఏ మార్చి.

మాఅయితే తనకు కారు వద్దని, నగదు కావాలని ఆమె ఫోన్‌లో సంప్రదించింది. నగదు కావాలంటే రూ.14.50 లక్షలుత్రమే ఇస్తామని, ఇందుకోసం రూ.14,800 ట్యాక్స్‌ చెల్లించాలని వారు తెలిపారు. అనంతరం కొద్ది సేపటికే మళ్లీ రూ.44,400 జీఎస్టీ చెల్లించాలని, అకౌంట్‌ నంబరు సైతం తెలిపారు. దీంతో కోల్‌కతాకు చెందిన బ్యాంకు అకౌంట్‌ నంబరు 623102010017104 నగదును ఫోన్‌ పే ద్వారా జమ చేశారు. అనంతరం ఆ ఫోన్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వస్తుంది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు హఫీజా, ఆమె సోదరుడు జమీర్‌ బుధవారం ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

మరిన్ని వార్తలు