లక్కంటూ... కిక్కిచ్చారు!

20 Sep, 2020 10:10 IST|Sakshi
సెల్‌ఫోన్‌ స్థానంలో వచ్చిన ఆంజనేయుని విగ్రహం

సెల్‌ఫోన్‌ స్థానంలో ఆంజనేయుడి విగ్రహం

పిడుగురాళ్ల టౌన్‌(గుంటూరు జిల్లా): మీకు లక్కీడీప్‌లో జె–7 సెల్‌ఫోన్‌ వచ్చింది.. నాలుగు వేలు చెల్లిస్తే.. రూ.14వేల విలువైన సెల్‌ఫోన్‌ అందుకోవచ్చు’ అని ఓ కంపెనీ వారి మాయమాటలు నమ్మిన ఓ యువకుడు నిండా మోసపోయిన ఘటన మంగళవారం జరిగింది. సెల్‌ఫోన్‌ స్థానంలో చిన్న ఆంజనేయస్వామి విగ్రహంతోపాటు హనుమాన్‌ చాలీసా విజిటింగ్‌ కార్డును పార్శిల్లో పంపిన వైనం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బత్తుల వెంకటేశ్వర్లు మూడునెలల కిందట సామ్‌సంగ్‌ కంపెనీ ఫ్రిజ్‌ను కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో పదిరోజుల కిందట వెంకటేశ్వర్లుకు ఫోన్‌ వచ్చింది. “మీరు ఫ్రిజ్‌ కొన్నారు కదా.. ఆ లక్కీడీప్‌లో జె–7 సెల్‌ఫోన్‌ వచ్చింది. నాలుగువేలు చెల్లించి పోస్టాఫీస్‌లో తీసుకోవాలి అని ఫోన్‌లో చెప్పారు. ఆశతో  వెంకటేశ్వర్లు రూ. నాలుగువేలు పోస్టాఫీస్‌లో చెల్లించి పార్శిల్‌ను అందుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లి పార్శిల్‌ తెరవగా అందులో చిన్న ఆంజనేయస్వామి విగ్రహం, హనుమాన్‌ చాలీసా విజిటింగ్‌కార్డు ఉండడంతో అవాక్కయ్యాడు.   

మరిన్ని వార్తలు