ప్రేమించిన యువతిని మిత్రుడు పెళ్లి చేసుకున్నాడని..

5 Sep, 2022 08:19 IST|Sakshi
నిందితుడు రాకేశ్‌

కృష్ణరాజపురం(కర్ణాటక): ఓ యువకుడి హత్య కేసులో పోలీసులు అతని స్నేహితుడిని అరెస్ట్‌ చేశారు. రెండు వారాల క్రితం బయప్పనహళ్లి పరిధిలో సతీశ్‌ (28) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు రాకేశ్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. వివరాలు... సతీశ్, రాకేశ్‌ ఇద్దరు స్నేహితులు. ఒకేచోట ఫ్లవర్‌ డెకరేష్‌ పనులు చేస్తున్నారు.
చదవండి: భర్తను దారికి తెచ్చుకోవాలనుకుంది.. చివరికి షాకింగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన భార్య

ఇదిలా ఉంటే రాకేశ్‌ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అదే యువతిని రాకేశ్‌కు తెలియకుండా సతీశ్‌ పెళ్లి చేసుకున్నాడు. దీంతో రాకేశ్‌ తీవ్ర ఆగ్రహంతో సతీశ్‌ను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితుడిని ఆదివారం అరెస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు