తన దుకాణంలోని బొప్పాయి పండును తినిందని..

19 Feb, 2021 15:20 IST|Sakshi

ముంబై : పండు తిన్నదన్న కారణంతో ఓ వ్యక్తి ఆవును చంపిన దారణ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తౌఫిక్ బషీర్ ముజావర్‌ అనే వ్యక్తి రాయ్‌గడ్‌లోని మురుద్‌ ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. అయితే తన దుకాణం నుంచి ఆవు బొప్పాయి పండును దొంగలించి తిన్నదన్న కోపంతో ఆవుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆవు పొత్తి కడుపులో కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు.  దీన్ని గమనించిన ఓ బాటసారి వెంటనే  పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఆవును వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆవు చనిపోయింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై  జంతు నిరోధక చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై హిందుత్వ సంఘాలు, పలువురు బీజేపీ నాయకులు మండిపడుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

 చదవండి :   ( రేండేళ్లుగా ప్రియురాలపై అత్యాచారం: ప్రియుడి అరెస్టు)

                (ప్రియుడి దొంగతనం.. ప్రేమికుల అరెస్టు)

మరిన్ని వార్తలు