టెన్త్‌ చదివి.. డాక్టర్‌నంటూ వైద్యం

22 Nov, 2020 05:11 IST|Sakshi
ఆసుపత్రి నిర్వాహకుడు సతీష్‌

నరసాపురంలో గాబ్రేల్‌ ఆసుపత్రి నిర్వాహకుడి మోసం

నరసాపురం: పదో తరగతి చదివి కోవిడ్‌తో సహా అన్ని వ్యాధులకు చికిత్స చేస్తున్న ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి నిర్వాహకుడి మోసాన్ని డీఎంఅండ్‌హెచ్‌వో వెలుగులోకి తెచ్చారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగింది. నరసాపురం బ్రాహ్మణ సమాఖ్య భవనం రోడ్డులో ఉన్న గాబ్రేల్‌ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ సునంద శనివారం తనిఖీ చేశారు.

డాక్టర్‌ స్థానంలో ఉన్న ఆసుపత్రి నిర్వాహకుడు సతీష్‌ (35)ను సర్టిఫికెట్‌లు, అనుమతులు చూపాలని కోరారు. తనకు పీఎంపీ, ఆర్‌ఎంపీ సర్టిఫికెట్‌ కూడా లేదని, పదో తరగతి వరకు చదివానని సతీష్‌ చెప్పడంతో వెంటనే ఆసుపత్రిని సీజ్‌ చేసి అక్కడ ఉన్న హైపవర్‌ యాంటీ బయోటిక్‌ మందులను స్వాధీనం చేసుకున్నారు. సతీష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న అక్రమ వైద్యం చేస్తున్న పీఎంపీ, ఆర్‌ఎంపీలు కొందరు తమ వైద్యశాలలు మూసేసి పరారయ్యారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు