పోలీసులమంటూ కిడ్నాప్‌లు 

18 Sep, 2022 08:43 IST|Sakshi

కృష్ణరాజపురం: డబ్బున్న వారిని చూసి కిడ్నాప్‌ చేసి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఘరానా ముఠాను బెంగళూరు బ్యాటరాయనపుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్, మహారాష్ట్రకు చెందిన సిద్దార్థ, నాగురావు, కిరణ్, బానుదాస్‌. వీరు పోలీస్‌ అధికారులమని చెప్పుకుంటూ ధనవంతులను అపహరించే దందాకు  పాల్పడుతున్నారు.  

శివారెడ్డిని కిడ్నాప్‌ చేసి..  
వివరాలు.. ఇటీవల ఈ ముఠా శివారెడ్డి అనే రియల్టర్‌ను కిడ్నాప్‌ చేసి డబ్బు వసూలు చేయడంతో బాధితుడు బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి ఇటీవల  నిందితులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని క్లబ్‌లో ఉండగా అరెస్టు చేశారు. శివారెడ్డి, అతని స్నేహితురాలు పనిమీద  హైదరాబాద్‌కు వెళ్ళిన సమయంలో హరీష్‌ ద్వారా వీరు పరిచయం అయ్యారు.

తరువాత బెంగళూరులో భూమి కొనాలని వచ్చి శివారెడ్డిని పిలిపించి కిడ్నాప్‌ చేశారు. వసంతకు ఫోన్‌ చేసి రూ.50 లక్షలు ఇస్తేనే శివారెడ్డిని వదిలివేస్తామన్నారు. దీంతో వసంత రూ. 11 లక్షలు తీసుకెళ్లి ఈ ముఠాకు ఇవ్వగా అతన్ని విడిచిపెట్టారు. తరువాత బాధితులు వచ్చి బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేశారు.  హరీష్‌   పరారీలో ఉన్నాడు. ఈ ముఠా బెంగళూరు, హైదరాబాద్‌లలో పలు నేరాలకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి.  

(చదవండి: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం... నడిరోడ్డుపై పల్టీ కొట్టి..)

మరిన్ని వార్తలు