వీడియో: కూకట్‌పల్లిలో విషాదం.. కరెంట్‌ షాక్‌తో మహిళ మృతి

10 Aug, 2023 20:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బోర్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తూ కరెంట్‌ షాక్‌తో వివాహిత గంగా భవాని(33) అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. అల్విన్ కాలనీ పైప్ లైన్ రోడ్డులో ఉన్న ప్రేమ్ సరోవర్ అపార్ట్ మెంట్‌లో గంగాభవాని(33) పని మనిషిగా పనిచేస్తోంది. అయితే, గంగా భవాని అపార్ట్‌మెంట్‌లో బోర్‌వెల్‌ ఆన్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్‌ షాక్‌తో మృతిచెందింది. కరెంట్‌ షాక్‌ తగిలిన వెంటనే ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. కొద్ది నిమిషాల తర్వాత ఆమె నేలపై పడి ఉండటాన్ని గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. 

కాగా, ప్రేమ్‌ సరోవర్‌ అపార్ట్‌మెంట్‌లోనే ఆమె భర్త వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమారు 11 సంవత్సరాల వయస్సు గల ఒక అమ్మాయి మరియు 9 సంవత్సరాల వయస్సు గల అబ్బాయి ఉన్నారు. వీరు ఏపీవాసులుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: ఎన్టీపీసీలో ఘోర ‍ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి

మరిన్ని వార్తలు