బిహర్‌ గ్యాంగ్‌స్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులు..

23 Jul, 2021 13:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పట్నా: గత కొంత కాలంగా బిహర్‌ పోలీసులకు కంటిమీదకునుకు లేకుండా చేసిన గ్యాంగ్‌స్టర్‌ మున్న మిశ్రాను బిహర్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. యూపీకి చెందిన మిశ్రాను దేవోరియా ప్రాంతంలో యూపీ, బిహర్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడిపై ఇప్పటికే అనేక హత్యలకు సంబంధించిన కేసులు, కిడ్నాప్‌లు‌, లూటీ కేసులు ఉన్నాయని తెలిపారు.

మున్న మిశ్రా ఆచూకీని తెలియజేస్తే యాభైవేలు ఇ‍స్తామని గతంలోనే యూపీ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, విశ్వసనీయ సమాచారం మేరకు.. యూపీలోని దియోవరియా ప్రాంతంలోని ఒక ఇం‍ట్లో మున్న మిశ్రా ఉన్నట్లు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత దాడిచేసి అతడిని అదుపులోని తీసుకున్నామని యూపీ పోలీసులు పేర్కొన్నారు. నిందితుని దగ్గర నుంచి ఏకే 47 రైఫిల్‌ గన్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, యూపీలోనే మరొక గ్యాంగ్‌స్టర్‌ బదన్‌ సింగ్‌కు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగిన మరుసటి రోజే మిశ్రాను పట్టుకున్నామని అధికారులు పేర్కొన్నారు.

బదన్‌ సింగ్‌పై కూడా ఒక లక్ష రూపాలయల రివార్డు ఉందని తెలిపారు. కాగా, పోలీసులు ఆగ్రా, రాజస్థాన్‌ బార్డర్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అనుమానస్పదంగా ఉండటాన్ని గమనించారు. వారి వద్దకు చేరుకునేలోపే.. పోలీసులుపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు కాల్పులలో నిందితులు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో వారిని  ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారని అధికారులు తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు