తల్లి, సోదరుడ్ని కాల్చి చంపిన బాలిక

29 Aug, 2020 20:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : మానసిక పరిస్థితి సరిగా లేని ఓ బాలిక తల్లిని, సోదరుడ్ని కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌, లక్నో గౌతమ్‌పల్లి కాలనీకి చెందిన ఓ బాలిక పదవ తరగతి చదువుతోంది. జాతీయ స్థాయి షూటింగ్‌లో పాల్గొన్న సదరు బాలిక మానసిక పరిస్థితి గత కొద్దికాలంగా బాగుండటం లేదు. ఈ నేపథ్యంలో శనివారం షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేసే తుపాకితో తల్లి, సోదరుడిపై కాల్పులు జరిపింది. అనంతరం బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.

బాలిక చేతిలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని హత్యలు చేయటానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలితో పాటు ఇంట్లో పనిచేసే పని మనిషిని విచారిస్తున్నారు. మృతుదేహాలను పోస్టుమార్టమ్‌ నిమిత్తం తరలించారు.

మరిన్ని వార్తలు