ప్రేమవద్దన్నందుకు బాలిక ఆత్మహత్య

1 Jul, 2022 07:00 IST|Sakshi

జీడిమెట్ల: ప్రేమ వద్దని తల్లిదండ్రులు మందలించినందుకు మైనర్‌ బాలిక చెరువులో దూకి అత్మహత్య చేసుకుంది. ఈ  సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు, బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు..  దర్గయ్య, లలిత దంపతులు కుత్బుల్లాపూర్‌ అయోధ్యనగర్‌లో ఉంటున్నారు. వీరి కుమార్తె  9వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో శివ, ఇందిర దంపతుల కుమారుడు (14) 9వ తరగతి చదువుతున్నాడు. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం తల్లిదండ్రులకు తెలియడంతో బాలికను ఇంటి వద్దనే ఉంచుతున్నారు.  

బుధవారం ఉదయం  బాలిక అపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న తండ్రి దర్గయ్యకు టిఫిన్‌ బాక్సు ఇచ్చి సుభాష్‌నగర్‌లో బాలుడిని కలిసింది. ఇద్దరు కలిసి వీరితో చదివే వేరే బాలుడి ఇంటికి వెళ్లి అక్కడ బాలుడి స్కూల్‌ బ్యాగును ఉంచారు. మద్యాహ్నం  సైకిల్‌పై ఇద్దరూ వెళ్లారు. రాత్రైనా ఇద్దరు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు వేర్వేరుగా జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు.

సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు బాలిక, బాలుడి చెప్పులు, బాలుడి సైకిల్‌ను జీడిమెట్ల ఫాక్స్‌సాగర్‌ వద్ద గుర్తించారు. ఇద్దరు చెరువులో దూకి ఉంటారనే అనుమానంతో గజ ఈతగాళ్లను రప్పించి  గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రం బాలిక(14) మృతదేహం చెరువు నీటిపై తేలడంతో ఒడ్డుకు తీసి మృతదేహాన్ని పోస్టుమార్డమ్‌ నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. 

లభించని బాలుడి ఆచూకీ? 
బాలుడు బాలికతో పాటు నీటిలో దూకాడన్న అనుమానంతో పోలీసులు చెరువులో వెతకడం మొదలుపెట్టారు. ఎంతసేపైనా బాలుడి అచూకీ లభించకపోవడంతో పాటు బాలుడి తండ్రి సదరు బాలుడికి ఈత వచ్చని తెలిపారు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. గురువారం చీకటి పడటంతో బాలుడికోసం గాలింపు చర్యలు సైతం చేపట్టారు.   

(చదవండి: కిడ్నాపర్ల చెరలో నందగిరి వాసి)

మరిన్ని వార్తలు