నేరాల్లో దిట్ట.. జువైనల్‌ హోం సిబ్బంది కళ్లుగప్పి..

20 Apr, 2021 13:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కాచిగూడ: నింబోలి అడ్డలోని బాలికల జువైనల్‌ హోం నుంచి ఓ యువతి పారిపోయిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్‌ కుమార్తె సమ్రీన్‌(18) ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. వివిధ నేరాలకు సంబంధించి నెల రోజుల క్రితం బాలికా సదన్‌కు తీసుకువచ్చారు.

సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో సమ్రీన్‌ సిబ్బంది కళ్లుగప్పి ప్రధాన గేట్‌ తాళం తీసుకుని పారిపోయింది. విషయం తెలుసుకున్న బాలికా సదన్‌ సిబ్బంది ప్రమీల కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు