సినిమా స్టైల్లో.. షాకింగ్‌ విషయాన్ని చెప్పిన ఇంటర్‌ విద్యార్థిని.. కంగుతిన్న పోలీసులు

22 Sep, 2022 20:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పెదపూడి(​కాకినాడ జిల్లా): జి.మామిడాడలో తమ బాలిక కిడ్నాప్‌కు గురైందని ఆమె తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించడంతో పోలీసులు బాలికను పట్టుకున్న ఉదంతమిది. పెదపూడి ఎస్‌ఐ పి.వాసు తెలిపిన వివరాల ప్రకారం జి.మామిడాడకు చెందిన ఓ బాలిక ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం 10 గంటలకు బాలిక రాలేదంటూ కళాశాల యాజమాన్యం ఫోన్‌ చేయడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు.
చదవండి: వ్యభిచారం గుట్టురట్టు.. పోలీసులకు దొరికేసిన ఐదు జంటలు

సెల్‌ లొకేషన్‌ ఆధారంగా బాలిక రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్నారని నిర్ధారించుకున్నారు. బాలికతో పాటు ఆమెను తీసుకెళుతున్న యువకుడిని సైతం పట్టుకున్నారు. నాలుగేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రాం ద్వారా పరిచయమైన తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన ఒక యువకుడిని ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకోవడానికి అతడితో వెళ్లినట్లు బాలిక చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు. బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించి యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  

మరిన్ని వార్తలు