వాష్‌రూమ్‌ వెళ్లొస్తానని చెప్పిన యువతి.. ఎంతసేపటికీ రాకపోవడంతో..

1 Aug, 2021 11:55 IST|Sakshi
మిని ఏంజెల్‌ (ఫొటో)

సాక్షి, అడ్డగుట్ట(హైదరాబాద్‌): వాష్‌రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తమిళ్‌నాడులోని రాణిపేట్‌ జిల్లాకు చెందిన మిని ఏంజెల్‌(22) తండ్రిపేరు బాబు థామస్, వృత్తి రీత్యా స్టాఫ్‌ నర్స్‌. ఈ నెల 29న మిని ఏంజెల్‌ కుటుంబ సభ్యులందరూ తమిళనాడు వెళ్లేందుకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చి శబరి ఎక్స్‌ప్రెస్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

వాష్‌రూమ్‌ వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన మిని ఏంజెల్‌ ఎంతసేపటికీ రాకపోవడంతో అక్కడికి వెళ్లి చూడగా కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు