ప్రియుడి ఇంటి వద్ద ప్రియురాలి ఆందోళన

9 Apr, 2022 21:19 IST|Sakshi

సాక్షి,చిన్నశంకరంపేట(మెదక్‌): ప్రేమించిన యువకుడు మరో పెళ్లి చేసుకొని తనకు అన్యాయం చేశాడని, తనకు న్యాయం చేయాలని తన కుమారుడితో ప్రియుడి ఇంటి ఎదుట యువతి దీక్షకు దిగిన ఘటన మండలంలోని మిర్జాపల్లిలో చోటు చేసుకుంది. మిర్జాపల్లి గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. ప్రియురాలికి తెలియకుండా ప్రేమికుడు తన మేన మరదలను వివాహం చేసుకున్నాడు.

మల్కాజిగిరిలో ఉండే యువతికి విషయం తెలిసి యువకుడిని నిలదీసింది, అప్పటికే తాను గర్భవతినని తనకు న్యాయం చేయాలని గ్రామంలో పంచాయితి పెట్టింది. యువకుడు, యువకుడి కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల క్రితం పోలీస్‌లు కేసునమోదు చేసుకొని యువకుడిని అరెస్ట్‌ చేశారు. తాజాగా మూడు రోజులుగా ఆమె తన బిడ్డతో కలిసి వచ్చి ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. శుక్రవారం యువతికి పోలీసులు నచ్చజెప్పి ఇరువురికి పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకోవాలని చిన్నశంకరంపేట ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ తెల్చిచెప్పారు.

మరిన్ని వార్తలు